అభివృద్ధి చేసేవారిని గెలిపించండి : కోలగట్ల

Apr 4,2024 21:39

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  : నగరంలోని 49వ డివిజన్‌ గాజులరేగపరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. స్థానికులు, వైసిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేయర్‌ విజయలక్ష్మి, కార్పొరేటర్‌ నడిపిల్లి ఆదినారాయణ మాట్లాడుతూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులనే గెలిపించాలని తద్వారా నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా పయనించేందుకు అవకాశం ఉంటుందని ఓటర్లను అభ్యర్థించారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు నగర సుందరీకరణతో నగరం అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా పయనించిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మన్యాల కృష్ణ, 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ పట్టా ఆదిలక్ష్మి, వైసిపి నాయకులు కణుగుల రాజా, వైసిపి నగర ప్రధాన కార్యదర్శి జామాన శ్రీనివాసరావు, జమ్ము మధు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️