మహిళా చైతన్యం

ప్రజాశక్తి – కడప ప్రతినిధిసార్వత్రికంలో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. కడప పార్లమెంట్‌లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 37 వేలు, రాజంపేట పార్లమెంట్‌లో 26 వేల ఓట్లపైగా నమోదు కావడం గమనార్హం. 1996 ఎన్నికల అనంతరం ఎన్న డూలేని విధంగా పోటాపోటీగా సాగిన తాజా ఎన్నికల్లో ఎవరు గెలిచినా స్వల్పమెజార్టీలతో గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో మహిళా ఓటరు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందనే విశ్లేషణ వినిపిస్తోంది. కడప పార్లమెంట్‌లో 16,39,066 మంది ఓటర్లలో పురుష ఓటర్లు 8,00,857 మంది, మహిళా ఓటర్లు 8,37,993 మంది, ఇతర ఓటర్లు 216 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 37,406 మంది ఉండడం గమనార్హం. రాజంపేట పార్లమెంట్‌లో 14,26,834 లక్షల ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 7,00,380 మంది, మహిళా ఓటర్లు 7,26, 327 మంది, ఇతరులు 91 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 25.947 వేల మంది అధికంగా ఉండడం గమనార్హం. కడప పార్లమెంట్‌ పరిధిలోని కడప అసెంబ్లీలో 2,83,543 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,38,300 మంది, మహిళా ఓటర్లు 1,45,152 మంది, 90 మంది ఇతరులు ఉన్నారు. సుమారు 6,852 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బద్వేల్‌ అసెంబ్లీలో 2,19,290 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,09,163 మంది, మహిళా ఓటర్లు 1,10,122 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. 959 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పులివెందుల అసెంబ్లీలో 2,29,687 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,11,727 మంది, మహిళా ఓటర్లు 1,17,941 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. 6,214 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కమలాపురం అసెంబ్లీలో 2,04,169 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 99,851 మంది, మహిళా ఓటర్లు 1,04,284 మంది ఓటర్లు, ఇతరులు 34 మంది ఉన్నారు. 4,433 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీలో 2,42,556 ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,17,746 మంది, మహిళా ఓటర్లు 1,24,795 మంది, ఇతర ఓటర్లు 15 మంది ఉన్నారు. 7,049 మంది ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రొద్దుటూరు అసెంబ్లీలో 2,47,966 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,19,985, మహిళా ఓటర్లు 1,27,933, ఇతర ఓటర్లు 48 మంది ఉన్నారు. 7,948 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మైదుకూరు అసెంబ్లీలో 2,11,855 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 104,085 మంది, మహిళా ఓటర్లు 1,07, 765 మంది ఉన్నారు. 3,680 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. రాజంపేట పార్లమెంట్‌లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 25,947 మంది ఎక్కువగా ఉన్నారు. రాజంపేటలో 2,41,200 ఓటర్లు ఉండగా 1,83, 442 ఓట్లు నమోదయ్యాయి. పురుష ఓటర్లు 1,17,577 మంది, మహిళా ఓటర్లు 1,23,617 మంది ఉన్నారు. 6,040 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రైల్వేకోడూరులో 2,04,456 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,00, 663 మంది, మహిళా ఓటర్లు 1,03,794 మంది ఉన్నారు. 3,131 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాయచోటిలో 2,55,168 మంది ఓటర్లు ఉన్నారు. 1,26,090 మంది పురుష ఓటర్లు, 1,29,051 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,961 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. తంబళ్లపల్లిలో 2,24,802 మంది ఓటర్లు ఉన్నారు. 1,10,627 మంది పురుష ఓటర్లు, 1,14,163 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 3,535 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పీలేరులో 2,34,608 మంది ఓటర్లు ఉన్నారు. 1,14,962 మంది పురుష ఓటర్లు, 1,19,624 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 5,464 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మదనపల్లిలో 2,66,590 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,30,461 మంది, మహిలా ఓటర్లు 1,36,078 మంది ఉన్నారు. 5,617 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కడప, రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని 13 అసెంబ్లీల బరిలో కడప పార్లమెంట్‌ బరిలో కాంగ్రెస్‌ తరుపున మహిళా అభ్యర్థి వైఎస్‌ షర్మిల, కడప అసెంబ్లీకి టిడిపి తరుపున ఆర్‌.మాధవి బద్వేల్‌ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్‌ తరుపున విజయజ్యోతి, వైసిపి తరుపున డాక్టర్‌ సుధ, రైల్వేకోడూరు అసెంబ్లీ బరిలో కాంగ్రెస్‌ తరుపున గోశాల దేవి పోటీ చేసిన నేపథ్యంలో మహిళా ఓటర్లు మోస్తరుగా మహిళా అభ్యర్థులకు మద్దతుగా తెలిపి నట్లు తెలుస్తోంది.

➡️