కార్మికుల రక్తదానం

Jun 14,2024 20:36

సామాజిక బాధ్యతగా రక్తదానం చేయడం అభినందనీయం

డిఎంఅండ్‌హెచ్‌ భాస్కరరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : కార్మికుల సమస్యలపై పోరాటాలు మాత్రమే కాకుండా సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం వంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎస్‌.బాస్కరరావు, డిసి హెచ్‌ బి.గౌరీశంకర్‌, కార్మిక శాఖ అధికారి ఎన్‌.సుబ్రమణ్యం, ప్రముఖ చిన్నపిల్లల వైద్యలు డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం, చేగువేరా జయంతి సందర్భంగా సిఐటియు, మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రోటరీ బ్లడ్‌ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభిస్తూ వారు మాట్లాడారు. రక్తం దానం చేయడం వలన దాత ఆరోగ్యం మేరుగుపడడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేసి వారి ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. ప్రస్తుతం రక్త నిల్వలు తగ్గడం వలన రక్త అవసరం ఎంతో అవసరం ఉందన్నారు. కిడ్నీ, డయాలసిస్‌, తలసెమియా, సికిల్‌ సెల్‌ అనిమియా, హిమోఫిలియా వంటి రోగులకు నిరంతరం రక్తం అవసరముంటుందన్నారు. ఇటువంటి సంఘాలు, సంస్థలు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా రోగుల ప్రాణాలను కాపాడవచ్చనని అన్నారు. ప్రజలు కూడా రక్తదానం పట్ల మరింత అవగాహన పెంచుకొని ఇటువంటి శిబిరాలలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.శంకర్రావు, కె.సురేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు జి.అప్పలసూరి, ఎం.శ్రీనివాస, ఎ.గౌరినాయుడు, నగర అధ్యక్షులు ఎ.జగన్మోహన్‌ రావు, ఉపాధ్యక్షులు రెడ్డి శంకర్రావు, మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీను, కోశాధికారి డిఎల్‌ఎన్‌ మూర్తి సుధీర్‌, యుపిహెచ్‌సి ఎంప్లాయిస్‌ అధ్యక్షులు బాలరాజు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు అరుణ్‌, యుగంధర్‌, లక్ష్మీ సాయి, ఫెర్రో అల్లాయిస్‌ యూనియన్‌ నాయకులు నాగరాజు, మిమ్స్‌ యూనియన్‌ నాయకులు నాగభూషణం, డివైఎఫ్‌ఐ నాయకులు హరీష్‌, అనంద్‌ తదితరులు పాల్గొన్నారు..

➡️