నరసాపురంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

ప్రజాశక్తి-నరసాపురం:మూడు వారాలకు మించి దగ్గు ఉంటే అది క్షయ వ్యాధి కావొచ్చని , అవగాహన కలిగి ,జాగ్రత్తలు వహించాలని నరసాపురం ఏరియా ఆసుపత్రి సూపరడెంట్ ఆర్.సుప్రియ అన్నారు.ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా అవును మేము క్షయవ్యాధిని అంతం చేయగలము అనే నినాదంతో ఆదివారం నరసాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్షయవ్యాధి నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమం జరిగింది .ఈ సందర్భంగా డా.ఆర్.సుప్రియా మాట్లాడుతూ టీబీ వ్యాధి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని, క్షయ వ్యాధి దగ్గు, తుమ్మడం, ఉమ్మి వేయడం ద్వారా గాలిలో కలుస్తుందన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ అయితే రోగికి ఆరు నెలలు మందులు ఉచితంగా ప్రభుత్వం అందిస్తామన్నారు. క్షయ వ్యాధి మందులను క్రమం తప్పకుండా ఆరు నెలలు వాడితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. అవగాహన కలిగి ఉండాలి అన్నారు. షుగర్ పేషెంట్లు ప్రతి మూడు నెలలకు ఓసారి కపం పరీక్ష చేయించుకోవడం మంచిదన్నారు. హెచ్ఐవి సోకిన ప్రతి పేషెంట్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీ బి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు మూడో నెల ,ఆరోనెల ,తొమ్మిదో నెల ముందు టీబి కపం పరీక్ష చేయించుకోవడం మంచిదన్నారు. అనంతరం క్షయ వ్యాధి రోగులకు పౌష్టికాహారం కిట్టు అందజేశారు. క్షయ వ్యాధి నివారణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డా.నళిని, డా.ప్రశాంతి,డా.గణేష్,ఐసిటీసీ మెడికల్ కౌన్సిలర్ జేసు ప్రసాద్ బాబు,టిబిహెచ్వి మురళి, బిందు తదితరులు పాల్గొన్నారు.

➡️