తిప్పలవలసలో వైసిపి ఎన్నికల ప్రచారం

Apr 12,2024 21:26

ప్రజాశక్తి – పూసపాటిరేగ :  అభివృద్ధి చేసిన పార్టీలకు అవకాశం ఇవ్వాలని నెల్లిమర్ల ఎమ్యెల్యే బడ్డకొండ అప్పలనాయుడు కోరారు. శుక్రవారం మండలంలోని తిప్పలవలసలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ మహంతి శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపిలు అల్లాడ రమేష్‌, ఎన్‌.సత్యనారాయ రాజు, నాయకులు మహంతి జనార్దనరావు, పుప్పాల లకీëనారాయణ, రామతీర్థ ఆలయ బోర్డు సభ్యులు దాడిశెట్టి త్రినాదరావు, వాసుపల్లి దుర్గమ్మ, వాసుపల్లి అప్పన్న, గున్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 75 కుటుంబాలు చేరిక వెల్దూరు పంచాయతీ కాలపురెడ్డిపేటకు చెందిన బోయి సూరిబాబు ఆధ్వర్యాన 75 కుటుంబాలు వైసిపిలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే బడ్డుకొండ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️