రైతు ఆత్మహత్యలపై స్పందించని ప్రభుత్వం

Nov 24,2023 15:20 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని : క‌రువు ప‌రిస్థితుల దృష్ట్యో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయ‌ని జనసేన పార్టీ పట్టణ మండలాధ్యక్షులు యం.తాహేర్ వలి, రేణు వర్మ, పులి రాజు విమ‌ర్శించారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు సోమేష్ మృత‌దేహాన్ని శుక్ర‌వారం ఏరియా ఆసుపత్రి నందు సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామంలో రైతు సోమేష్ పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ‌టం బాధాక‌ర‌మ‌న్నారు. సొంత పొలం 1.50 ఎక‌రాలతోపాటు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత సకాలంలో పంట రుణం ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం కావడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం ఇప్పటికి స్పందించకపోవడం దారుణం అన్నారు. ప్రైవేటు వ్యక్తుల నుండి ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని రైతులు కట్టలేక‌ ఆత్మహత్యలకు పాల్పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వటానికి రైతు తప్పనిసరి అనుమతి అంటూ ఆంక్షలు పెట్టడంతో రైతును అందుకు ఒప్పుకోక‌వడంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. సాగునీరు అందించాలన్న చిత్తశుద్ధిగాని పాలకుల‌కు ప్రభుత్వానికి లేని కారణంగా ప్రతి ఏటా కరువుతో పశ్చిమ ప్రాంతం రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారన్నారు. పాలకులు ప్రత్యామ్నాయ విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బాధితుల కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గాజుల రాజశేఖర్, నెల్లిబండ రాజశేఖర్, రాకేష్, వీరేష్, రాజు, గోవిందు, వెంకటేష్, శ్యామ్,

➡️