జగన్ ప్రభుత్వ పాలనలో రైతులకు న్యాయం

Dec 8,2023 15:41 #Kadapa
ycp leader visit cyclone effectef area

జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి

ప్రజాశక్తి – వేంపల్లె : జగన్ ప్రభుత్వ పాలనలో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సబ్సిడీతో పిబిసి పైపులు పంపిణీ చేస్తున్నట్లు జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలోని వ్యవసాయ కార్యాలయం వద్ద 50 శాతం సబ్సిడీతో పిబిసి పైపులను రైతులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్సిడీ పిబిసి పైపుల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎపిఐఐసి డైరెక్టర్ చంద్ర ఓబుల్ రెడ్డి, ఎంపిపి లక్ష్మి గాయత్రీలు ప్రారభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 400 వందల మంది రైతులకు సబ్సిడీ కింద పిబిసి పైపులను రైతులకు అందజేసినట్లు తెలిపారు. ఒక్కొక్క రైతుకు రెండు ఇంచి పైపులు 45 పైపులు, రెండున్నర ఇంచి పైపులు అయితే 30 పైపులు, నాలుగు ఇంచి పైపులు అయితే 20 పైపులు రైతులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఇచ్చినట్లు చెప్పారు. ఎంపి అవినాష్ రెడ్డి జిల్లా కలెక్టర్, ఒఎస్టీ తో మాట్లాడి పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాలకు 50 శాతం సబ్సిడీతో పిబిసి పైపులను సరఫరా చేయడం సంతోషకరమని చెప్పారు. రైతులందరూ జగన్ ప్రభుత్వాన్ని మరచి పోకుండా గుర్తు పెట్టుకోవాలని కోరారు. కష్ట కాలంలో వర్షాలు కూడ సరిగా పడక పోవడంతో రైతులు విత్తనాలను కూడ వేయలేని పరిస్థితి నెలకొంది అన్నారు. సాగునీటి సమస్య వచ్చే పరిస్థితి ఉండడంతో సబ్సిడీ తో పైపులను సరఫరా చేసినట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఇలాంటి పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చారు కాని మార్కెట్ రేటుకు ప్రభుత్వం ఇచ్చిన రేటుకు పెద్ద వ్యత్యాసం లేదన్నారు. ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం సరఫరా చేసిన పైపుకు మార్కెట్ ధరకు రూ 300 వ్యత్యాసం ఉందని తెలిపారు. రైతులకు లబ్ధి చేయాలనే ఉద్దేశంతోనే పైపులు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాచినేని వేణు, మాజీ ఎంపిటిసి కంచెర్ల గంగరాజు, కేకే ఖాదర్, వ్యవసాయ అధికారులు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

➡️