ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించొచ్చు

ప్రజాశక్తి -కనిగిరి : ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని, రోజుకు 18 గంటల పాటు నిర్విరామంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయని సివిల్‌ ర్యాంకర్‌ వి.రాహుల్‌ కుమార్‌ తెలిపారు. కనిగిరి పట్టణంలో ఐడిఎల్‌ కంప్యూటర్స్‌ డైరెక్టర్‌ బిజెవి.ప్రవీణ్‌ కుమార్‌ అధ్యక్షతన మీట్‌ ద స్టూడెంట్‌ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌ కుమార్‌ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజానికి ఏదో ఒక మేలు చేయాలనే తపన ఉండాలన్నారు. ఆ తపనతోనే తాను కూడా ఐఎఎస్‌ అయినట్లు తెలిపారు. ఐఎఎస్‌ కావాలన్నది తన గోల్‌ అని తెలిపారు. తమ తాతయ్య గొప్పవాడివి అవుతావని చెప్పేవారని తెలిపారు. తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులు, విద్యాభ్యాసంలో తనను ఉన్నతంగా తీర్చిదిద్ధిన గురువులను ఎన్నటికీ మర్చిపోలేని ఈ సందర్భంగా రాహుల్‌ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి షేక్‌ గయాజ్‌ బాషా, ఎస్‌విఎల్‌ ,కెటిసి పాపారాయుడు ,ఫణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️