వాన కోసం …

Mar 25,2024 05:17 #edit page

ఎందుకో గానీ
ఈ వత్సరం మరింత
ఎండ సుడిగుండమౌతోంది
దాహపు రాగం ఎత్తుకుని
పట్నం వలసపోతోంది
పల్లె రైతు ఎండిన పంటతో
తల్లడిల్లుతున్నాడు!

బోరు మూగబోతే
గుండె చెరువైపోతే
జొన్నపంట కన్నీరు కురుస్తోంది!
కలలు కనే రైతు కతలు
వెతలుగా మిగులుతున్నాయి

వడ్డీలు నడ్డి విరుస్తోంటే
బతుకు సాకటం శోకమౌతోంది
మట్టి పగుళ్లలో
పరిమళం కోసం నిట్టూరుస్తున్నా…
కాల ప్రవాహంలో
ఎన్ని వసంతాలు
నా ముందు నుంచే వెళ్ళిపోయినా
ఇంకా శిశిరంలా చూపులు
వానకోసం కోసం రాలిపోతున్నారు!

దోసిళ్ళలో
కాసిన్ని నీటి చుక్కలు దాచుకోవాలి
ఇప్పుడు రైతంటే వెనకబడ్డ అంగడి సరుకు
అయినా
మట్టిని నమ్ముకున్న మనుషులకు
ఆకలి తీర్చడం తప్పా బతుకులో
ఎండని ఒంపటం తెలీదు!
– గవిడి శ్రీనివాస్‌
7019278368

➡️