పంచాంగాలు అబద్ధం

Apr 9,2024 07:40 #Almanacs, #edit page, #fake

ఉగాది వచ్చిందంటే పంచాగ శ్రవణాల హోరు మొదలౌతుంది. అది వాళ్ళ వృత్తి. అందులో ఎలాంటి నిజం ఉండదు. వారు చెప్పేదానిలో ఎలాంటి శాస్త్రీయత లేదు. తొమ్మిదో తేదీ నుండి శుభకృతు సంవత్సరం పోయి క్రోధి సంవత్సరం మొదలౌతుంది. అంతకు మించి ఏమీ వుండదు. తిథులు, వారాలు, నక్షత్రాలు..ఇవన్నీ మన అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నాము. వీటికి అంతకు మించి ప్రత్యేకత ఏమీలేదు. అయితే ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ సందర్భంగా పంచాంగాల పేరుతో, మేము చేప్పేది ఇలా జరుగుతుంది అని చెప్పకుంటూ కొంతమంది పొట్ట పోసుకుంటూ ఉన్నారు. ఇక రాజకీయ నాయకులు వారివారి ఆస్థాన జ్యోతిష్కుల చేత పంచాంగం చెప్పించుకుంటారు. అధికారంలో ఉన్న వారికి మరలా మీరే అధికారం చేపడతారని, ప్రతిపక్షంలో ఉన్నవారికి మేకే అధికారం వస్తుందని పచ్చి అబద్దాలు చెప్పి నమ్మపలికిస్తారు. ఆగ్రహం ఈ రాశిలో ప్రవేశించింది, కనుక అరిష్టమని, అరిష్టం తొలగాలంటే శాంతి చేస్తే సరిపోతుందని వేలువేలు డబ్బు గుంజుతారు. అసలు రాసులే అబద్ధం. ఆకాశంలో కనిపించే నక్షత్రాలకీ, ఆ గుంపు ఏ ఆకారంలో కనిపిస్తే పలనా రాశి అని చెపుతారు. ఒక ప్రాంతంలో ఒక ఆకారంలో కనిపించే నక్షత్రాల గుంపు, ఇంకో ప్రాంతం నుండి చూస్తే ఇంకో ఆకారంలో కనిపిస్తుంది. ఇదెలా శాస్త్రీయం? గ్రహాల, నక్షత్రాల కదలికలను బట్టి మన జీవితాలు ఉండవు. మన జీవితాలు ఎలా వుండేది మనకు మాత్రమే తెలుసు. కనుక పంచాంగాలు నమ్మవద్దు. అవి అబద్ధం.
– నార్నె వెంకట సుబ్బయ్య

➡️