తుపాను దెబ్బకు రైతు విలవిల

Dec 9,2023 07:12 #Editorial

మాగాణి ప్రాంతంలో ఈదురు గాలులకు కోతకొచ్చిన పైరు నేలవాలింది. కంకి బురదలో కూరుకుపోయింది. కోత మిషన్‌ ద్వారా నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబెట్టాల్సిన సమయంలో తుపాను మూలంగా సాధ్యం కాక గుట్టగా పోసి చాలా మంది రైతులు తాత్కాలికంగా కప్పి పెట్టారు. అయినా భారీ వర్షాలకు తడిసి పోయింది. రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం నీళ్ళలో కొట్టుకు పోయింది.

            మిచౌంగ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మెట్ట ప్రాంతంలో మిర్చి, పొగాకు, శనగ, పత్తి, మాగాణిలో వరి పైర్లు నీట మునిగిపోయాయి. పెట్టిన పెట్టుబడి కొట్టుకుపోయి రైతాంగం కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎకరా సేద్యానికి వేలకు వేల రూపాయలను రైతులు పెట్టుబడిగా పెట్టారు. కౌలు రైతులు అదనంగా కౌలుకు, సాగుకు పెట్టుబడి పెట్టారు. పంట నష్టపోవడం వల్ల మరింత అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. పంట పొలాలన్నీ చెరువుల్లాగా మారి వాగులుగా ప్రవహిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి….వివరాలు సేకరించాలి. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

మిర్చి మొక్కలు కొనుగోలు నుండి మొత్తం సాగు పక్రియ ముగిసేసరికి ఎకరానికి రూ.1,40,000 నుంచి 1,50,000 వరకు ఇప్పటికి ఖర్చయింది. గత ఏడాది పొగాకుకు మెరుగైన ధర లభించడంతో ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు రైతులు మొగ్గుచూపారు. పొగనారుకు డిమాండ్‌ ఉండడంతో మూట నారు మూడున్నర వేల నుంచి ఏడున్నర వేల రూపాయల వరకూ ధర పలికింది. ముందు నాటిన పొగాకు ఇప్పటికే పడిపోయింది. తరువాత నాటిన లేత పొలాలు నీట మునిగి పోయాయి. ఏమీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. నారుకు, దుక్కులు దున్నడానికి, అంతర్‌ వ్యవసాయం, ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్‌, కూలీల ఖర్చు, కౌలుకు వెరసి ఎకరాకు దాదాపు రూ.40 వేలు ఖర్చ యింది. మాగాణి ప్రాంతంలో ఈదురు గాలులకు కోతకొచ్చిన పైరు నేలవాలి ంది. కంకి బురదలో కూరుకుపోయింది. కోత మిషన్‌ ద్వారా నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరపెట్టాల్సిన సమయంలో తుపాను మూలంగా సాధ్యం కాక గుట్టగా పోసి చాలా మంది రైతులు తాత్కాలికంగా కప్పి పెట్టారు. అయినా భారీ వర్షాల కు తడిసి పోయింది. రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం నీళ్ళలో కొట్టుకుపోయింది.

పత్తి సాగుకు విత్తనాల ఖర్చు విపరీతంగా పెరిగింది. బహుళ జాతి కంపెనీ మోన్సాంటో, బేయర్స్‌ కంపెనీలు ఇష్టమొచ్చినట్లుగా విత్తనాల ఖరీదును పెంచేశాయి. గులాబీ రంగు పురుగు వల్ల పత్తి దిగుబడులు విపరీతంగా పడిపోయాయి. వ్యవసాయ ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. ఏ పంట పండిస్తే గిట్టుబాటు అవుతుందో తెలియని పరిస్థితుల్లో రైతు పత్తి పండిస్తున్నాడు. ఇప్పటికే ఎకరం పత్తి సాగుకు 50 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు . ఎర్ర శనగ సాగుకు ఎకరానికి దాదాపు 35,000 నుండి 40 వేల రూపాయల వరకు, మిర్చికి రూ.1,50,000,. పొగాకుకు రూ.40,000, శనగ సాగుకు రూ. 35 వేల నుండి రూ. 40,000, పత్తికి రూ. 50,000, వరి సాగుకు 60,000 రూపాయలు కనీసంగా ఖర్చయింది. స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కోచోట ఈ మొత్తాల కంటే అదనపు వ్యయం అయిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుల్లో ఉన్న రైతులు పెట్టిన ఖర్చులు తిరిగి రాకపోతే ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంది. వారిని ఆదుకునేందుకు కింది చర్యలు చేపట్టాలి.

  • రైతు పెట్టిన పెట్టుబడిలో సగం అయినా ప్రభుత్వం ఇస్తే …రైతు తిరిగి ఆ యా పైర్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి. అందుకు ఎటువంటి నిబంధనలు పెట్టరాదు.
  • రెండవ పంటకు కావాల్సిన తెల్లజొన్న , శనగ, వరి, మొక్కజొన్న, విత్తనాలను, ఎరువులు రైతులకు ఉచితంగా సరఫరా చేయాలి.
  • వర్షాల వల్ల పనులు కోల్పోయిన గ్రామీణ పేదల కుటుంబాలకు రూ.10 వేల ఉచిత ఆర్థిక సహాయంతో పాటు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేయాలి.
  • వాతావరణ సమతుల్యత లోపించడంతో అతివృష్టి, కుండపోత వర్షాలు, తుపానులు, కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. కాప్‌-28 సదస్సు ప్రకారం, వాతావరణం మార్పుల వల్ల దెబ్బతిన్న దేశాలకు నష్టాన్ని తట్టుకునేందుకు నిధులు అందించాలి.
  • - డా||| కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, సెల్‌:9000 657799
    – డా||| కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, సెల్‌:9000 657799
➡️