అందులో నేను విఫలమయ్యాను-సమంత

Jan 18,2024 19:12 #movie, #samantha

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సమంత తాజాగా ఆమె వైవాహిక జీవితం గురించి ట్విట్టర్‌ వేదికగా మాట్లాడారు. ‘నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యాను. ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. గతంలో నా భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడు. క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైంది. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది’ అని అన్నారు. ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ఆమె నటించిన ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది.

➡️