అభిమానితో మాట్లాడిన స్టార్‌ హీరోయిన్‌ రశ్మిక మందన్న

Dec 11,2023 08:17 #movie, #Rashmika

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ గా నిర్వహిస్తున్న కౌన్‌ బనేగా కరోర్‌ పతి-15 కార్యక్రమంలో సందడి చేసింది స్టార్‌ హీరోయిన్‌ రశ్మిక మందన్న. ఆమె అభిమాని అయిన కంటెస్టెంట్‌ ప్రమోద్‌ భాస్కర్‌ తో వీడియో కాల్‌ లో మాట్లాడింది. ప్రమోద్‌ భాస్కర్‌ రశ్మిక మందన్నకు పెద్ద అభిమాని. ఆమెను సోషల్‌ మీడియాలో ఫాలో అవుతుంటారు. తన ఫేవరేట్‌ హీరోయిన్‌ వీడియో కాల్‌ లో మాట్లాడేసరికి ప్రమోద్‌ సర్‌ ప్రైజ్‌ అయ్యారు. ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నాని, పర్సనల్‌గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్‌ అడగగా..రశ్మిక తప్పకుండా మీట్‌ అవుదామని చెప్పింది. అలాగే తన ఫ్యాన్‌ అయిన ప్రమోద్‌ కౌన్‌ బనేగా కరోర్‌ పతి ప్రోగ్రాంలో కంటెస్టెంట్‌ గా ముందుకు వెళ్లడం హ్యాపీగా ఉందని రశ్మిక చెప్పింది. అమితాబ్‌ బచ్చన్‌ మాట్లాడుతూ రశ్మిక ప్రతి సినిమాను చూస్తున్నామని, ఇటీవల యానిమల్‌ సినిమాలో ఆమె పర్‌ ఫార్మెన్స్‌ ఎంతో ఆకట్టుకుందని అన్నారు.రశ్మిక అమితాబ్‌ కు థ్యాంక్స్‌ చెప్పింది.

➡️