‘అమరన్‌’గా శివ కార్తికేయన్‌

Feb 17,2024 19:15 #movie, #siva karthikeyan

కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త ప్రాజెక్టుకు ‘అమరన్‌’ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. కమల్‌ హాసన్‌, సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, ఆర్‌ మహేంద్రన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వకీల్‌ ఖాన్‌ గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో, రాహుల్‌ సింగ్‌, శివ్‌ అరూర్‌ రాసిన ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌ సిరీస్‌లోని ఒక అధ్యాయం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కి జంటగా సాయిపల్లవి నటిస్తోంది.

➡️