అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ తాజా చిత్రం

Jan 24,2024 19:05 #ameer khan, #movie

అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లాపటా లేడీస్‌’. కిరణ్‌ రావ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జమ్తారా వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ స్పర్శ్‌ శ్రీవాస్తవ్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. భోజ్‌పురి నటుడు రవి కిషన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ట్రైలర్‌ విడుదలచేసింది. ఈ చిత్రం 2024 మార్చి 1న థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

➡️