అలాంటి పాత్రలు చేయలేను : తాప్సీ

Jan 23,2024 19:15 #movie, #thapsi

‘డంకీ’ చిత్ర విజయంలో ఉన్న తాప్సీ ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్‌’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇతర నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరికి నచ్చింది వారు ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. నటీనటులందరికి ప్రతిభా పాటవాలతో పాటు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని గౌరవిస్తూ నేను ముందుకు సాగుతాను. వ్యక్తిగతంగా మాత్రం నేను ఆ తరహా కథల్లో నటించలేను’ అని చెప్పారు.

➡️