‘ఆర్‌సి-16’ ప్రారంభించేశారు..

Mar 20,2024 19:05 #movie, #Ram Charan

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆర్‌సి-16’ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సగర్వ సమర్పణలో వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై వెంకట సతీష్‌ కిలారు భారీఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్‌, బోనీ కపూర్‌, సుకుమార్‌, జాన్వీ కపూర్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ హాజరయ్యారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా చేస్తోన్న డైరెక్టర్‌ శంకర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️