ఇంకా డిప్రెషన్‌లోనే ఉన్నా : ఇలియానా

Jan 6,2024 08:35 #iliyana, #movie

ప్రసవానంతరం కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తారన్నది వాస్తవం. నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. గదిలో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. ఇప్పటికీ డిప్రెషన్‌లోనే ఉన్నా. నాకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించింది. వాళ్లు ఏ కష్టం కలుగకుండా చూసుకున్నారు. మంచి భాగస్వామి దొరికినందుకు ఆనందంగా ఉంది’ అని నటి ఇలియానా తెలిపారు. గతేడాది ఆగస్టు 1న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ‘కోవా ఫీనిక్స్‌ డోలన్‌’ పేరు కూడా పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో తాజాగా ఆమె చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ‘నా కుటుంబం, ప్రియుడి గురించి ఎవరైనా మాట్లాడితే నాకు ఏమాత్రం నచ్చదు. అందుకే అలాంటి వాళ్లకు దూరంగా ఉంటున్నాను’ అంటూ పేర్కొన్నారు.

➡️