‘ఈగల్‌’ విడుదలపై ఫిలిం ఛాంబర్‌కుహీరో

Jan 20,2024 07:54 #movie, #raviteja

రవితేజ నటించిన ‘ఈగల్‌’ విడుదల కోసం మరోసారి ఫిలిం ఛాంబర్‌ను నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఆశ్రయించింది. ఈనెల 13న విడుదల కావాల్సిన ఈ సినిమా ఛాంబర్‌ పెద్దల నిర్ణయం మేరకు సంక్రాంతి బరి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు అదేరోజు ‘ఊరు భైరవకోన’, ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాలు విడుదల చేస్తామంటూ ఆయా చిత్రాల నిర్మాతలు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమకిచ్చిన ‘సోలో రిలీజ్‌ డేట్‌’ మాటను నిలబెట్టుకోవాలని ఛాంబర్‌ను సదరు నిర్మాణ సంస్థ కోరింది. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌, కావ్యాథాపర్‌ నటించారు. నవదీప్‌, మధుబాల తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9కు కూడా మరో రెండు సినిమాలు పోటీకి రావటంతో ఛాంబర్‌ ప్రతినిధులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

➡️