ఈవారం ఓటీటీలో, థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలివే !

Jan 30,2024 12:50 #OTT

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్‌, హనుమాన్‌ వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలు అలరించాయి. ఈ సినిమా సందడి అయిపోకముందే.. చిన్న చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఫిబ్రవరి మొదటివారంలో ఏ చిత్రాలు థియేటర్‌లోనూ, ఓటీటీలోనూ విడుదల కానున్నాయో తెలుసుకుందామా..!

మ్యారేజ్‌ బ్యాండు

‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌ హీరో సుహాస్‌ తాజాగా నటించిన చిత్రం ‘అంబాజీ పేట మ్యారేజ్‌ బ్యాండు’. హీరోయిన్‌ శివాని నాగరం సుహాస్‌కి జంటగా నటించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు దుశ్యంత కటికనేని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్‌ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ధీరజ్‌ మోగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ధీర

దర్శకుడు విక్రాంత్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ధీర’. ఈ సినిమాలో లక్ష్‌ చదలవాడ హీరోగా నటించారు. ఈ సినిమాను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

బూట్‌కట్‌ బాలరాజు

నటుడు సోహెల్‌ నటించిన తాజా చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. ఈ సినిమాలో సునీల్‌, ప్రముఖ నటి ఇంద్రజ కీలకపాత్రలు పోషించారు. సోహెల్‌కి జోడీగా మేఘ లేఖ కథానాయికగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని హీరో సోహెల్‌ తన సినిమా ప్రచారంలో చెబుతున్నారు. దర్శకుడు కొనేటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎండీ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

‘గేమ్‌ ఆన్‌’

కాబోతోందిహీరో తరుణ్‌, హీరోయిన్‌ నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దయానంద్‌ దర్శకత్వం వహించారు. కస్తూరి క్రియేషన్స్‌ అండ్‌ గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించారు. మరణించాలనుకునే ఓ వ్యక్తి, రియల్‌టైమ్‌ సైకలాజికల్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? అన్నదే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది.

కిస్మత్‌

ప్రముఖ దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కిస్మత్‌’. ఈ సినిమాలో నరేష్‌ అగస్త్య, రియా సుమన్‌, అభినవ్‌ గోమఠం, విశ్వదేవ్‌ వంటి తారాగణం నటించారు. ఈ చిత్రాన్ని కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దర్శకుడు శ్రీనాథ్‌ బాదినేని తెరకెక్కించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో రానుంది.

ఓటీటీలో..

డిస్నీ+హాట్‌స్టార్‌

  • మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 2
➡️