‘ఊరు పేరు…’ ట్రైలర్‌ విడుదల

Jan 18,2024 19:18 #movie, #sandeep kishan

సందీప్‌ కిషన్‌ హీరోగా వర్ష బల్లమ్మ హీరోయిన్‌గా వస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వి ఐ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్‌ విడుదలైంది. గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీల మిస్టరీనే ఈ భైరవ కోన అంటూ ట్రైలర్‌లో వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. ఫాంటసీ చిత్రంగా వస్తున్న ఇందులో ప్రేమ కథ కూడా మిళితమై ఉంటుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. హాస్య మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేస్తున్నారు. అదే రోజు రవితేజ ‘ఈగల్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నా తమ సినిమా విడుదల తేదీ వాయిదా వేయలేమని ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో స్పష్టం చేశారు.

➡️