‘ఊరు పేరు భైరవకోన’ వెనక్కి వెళ్లిందా!

Jan 25,2024 19:15 #movie

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రవితేజ ‘ఈగల్‌’ చిత్రానికి సోలో రిలీజ్‌ ఇస్తామని ఫిలిం ఛాంబర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 9న రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది ‘ఈగల్‌’ టీమ్‌. అయితే అదే రోజు ‘టిల్లు స్క్వేర్‌’, ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలు కూడా విడుదల తేదీలు ప్రకటించాయి. దీనిపై ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపిన ‘టిల్లు స్క్వేర్‌’ టీమ్‌ వాయిదా వేసినట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ‘ఊరు పేరు భైరవకోన’ కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఫిలిం ఛాంబర్‌తో జరిగిన చర్చల్లో చిత్రబృందం తమ వైఖరిని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వెనక్కి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా తమకు సోలో రిలీజ్‌ కావాల్సిందేనని చిత్రబృందం పేర్కొన్నట్లు సమాచారం. అప్పుడే రిలీజ్‌ వాయిదా వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

➡️