ఎన్టీఆర్‌కు ఘననివాళి

Jan 19,2024 08:21 #movie

కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 28వ వర్థంతి సందర్భంగా ఫిలింనగర్‌లోని విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు గురువారంనాడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ సినీ రంగం ద్వారా ప్రపంచానికి, తెలుగు వ్యాప్తి కోసం ఎన్టీఆర్‌ ఎంతో కృషిచేశారన్నారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు నందమూరి మోహన్‌కృష్ణ, మోహన రూప, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎఫ్‌ఎన్‌సిసి సెక్రటరీ మోహన్‌ ముళ్ళపూడి, మాజీ కార్పొరేటర్‌ కాజ సూర్యనారాయణ తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

➡️