ఎన్‌.శంకర్‌ పర్యవేక్షణలో మూడు వెబ్‌ సిరీస్‌

Feb 28,2024 19:12 #movie, #sankar

గతంలో అభ్యుదయ సినిమాలు తీసిన దర్శకుడు ఎన్‌.శంకర్‌ తాజాగా నిర్మాత, దర్శకత్వ పర్యవేక్షణలో మూడు హిస్టారికల్‌ వెబ్‌ సిరీస్‌లు తీయబోతున్నారు. ఎన్‌కౌంటర్‌, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణా వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తాజాగా ఎన్‌.శంకర్‌ టీవీ అండ్‌ ఫిల్మ్‌ స్టూడియో బ్యానర్‌ స్థాపించారు. తానే నిర్మాతగా, దర్శకత్వం వహిస్తూ ‘తెలంగాణా పోరు’, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తి, ఆదర్శప్రాయుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌’ వంటి పేర్లతో వెబ్‌ సిరీస్‌ తీయబోతున్నట్లుగా శంకర్‌ ప్రకటించారు.

➡️