ఓటీటీలోకి ‘సైంధవ్‌’

Jan 31,2024 19:20 #movie, #Venkatesh

వెంకటేశ్‌ నటించిన తాజా చిత్రం ‘సైంధవ్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఫిబ్రవరి 03 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానున్నట్లు మేకర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. వెంకటేష్‌ 75వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటించింది. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు.

➡️