ఓటీటీలో తెలుగు ‘ధూమం’

Dec 1,2023 08:54 #movie

ఫహాద్‌ ఫాజిల్‌ నటించిన ‘ధూమం’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. కన్నడం, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ రిలీజ్‌ చేశారు. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. పాన్‌ ఇండియన్‌ లెవెల్‌లో అన్ని దక్షిణాది భాషల్లో ధూమం సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ మొదట అనుకున్నారు. కానీ తెలుగు వెర్షన్‌ డబ్బింగ్‌ పనులు ఆలస్యం కావడం వల్ల థియేటర్లలో రిలీజ్‌ కాలేకపోయింది. తాజాగా డైరెక్ట్‌గా ఓటీటీలో తెలుగు వెర్షన్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో ఫహాద్‌ ఫాజిల్‌తో పాటు అపర్ణ బాలమురళి, రోషన్‌ మాథ్యూ ప్రధాన పాత్రలను పోషించారు. సిగరెట్‌ తాగడం వల్ల తలెత్తే అనర్థాల్ని యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో ధూమం సినిమాలో చూపించారు.

➡️