‘కన్నప్ప’ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది!

Mar 8,2024 19:05 #movie, #vishnu

న్యూజిలాండ్‌ లొకేషన్లలో షూటింగ్‌ జరుపుకుంటున్న మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం నుండి శుక్రవారం ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఈ చిత్ర నిర్మాణంలో 600 మంది హాలీవుడ్‌ ప్రముఖులు పనిచేశారు. ప్రస్తుతం మంచు విష్ణుతో పాటు మోహన్‌ బాబు తదితరులు అక్కడే ఉన్నారు. రెండో షెడ్యూల్‌ కోసం అతి త్వరలో ఇండియా వస్తున్నట్లు ఇటీవల మోహన్‌ బాబు తెలిపారు. మంచు ఫ్యామిలీకి చెందిన మూడు జెనరేషన్లతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని ఆరు భాషల్లో రివీల్‌ చేశారు. హీరోయిన్‌గా ప్రీతి ముఖుంధన్‌ నటిస్తున్నారు. మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

➡️