కళ్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’ సినిమా కోసం 90 కాస్ట్యూమ్స్‌

Dec 10,2023 19:15 #klayan ram, #movie

డిఫరెంట్‌ మూవీస్‌తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ లేటెస్ట్‌ మూవీ ‘డెవిల్‌. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్‌ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇదొక పీరియడ్‌ డ్రామా. బ్రిటీష్‌వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావటంతో నాటి పరిస్థితులను ఆవిష్కరించేలా భారీగా సినిమాను చిత్రీకరించారు. అలాగే నటీనటులకు సంబంధించిన వస్త్రాలంకరణ భారతీయతను ప్రతిబింబించేలా ఉంటుంది.కళ్యాణ్‌ రామ్‌ను గమనిస్తే ఆయన ఇందులో గూఢచారిగా కనిపించబోతున్నారు. ఇలాంటి పాత్రను ఆయన చేయటం ఇదే మొదటిసారి కావటంతో దర్శక నిర్మాత అభిషేక్‌ నామా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రాజేష్‌ , కళ్యాణ్‌ రామ్‌ లుక్‌ను సినిమా ఆసాంతం సరికొత్తగా ఉండేలా డిజైన్‌ చేశారు.

➡️