‘గామి’ డిఫరెంట్‌ సినిమా

Mar 1,2024 19:15 #movie, #viswaksen

విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గామి’ షో రీల్‌ ట్రైలర్‌ శుక్రవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా లాంచ్‌ చేశారు. ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయికగా నటించగా, అభినయ, హారిక పెడాడ, మహ్మద్‌ సమద్‌ కీలక పాత్రలు చేశారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో సందీప్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌ చాలా బావుంది. ఆరేళ్ళు పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్‌, డైరెక్టర్‌, నిర్మాతలకు చాలా పాషన్‌ వుంటేనే ఇది సాధ్యమౌతుంది. మేకప్‌ అందుబాటులో లేనప్పుడు విశ్వక్‌ స్వయంగా మేకప్‌ చేసుకున్న సందర్భాలు వున్నాయి. థియేటర్స్‌లో చూసేటప్పుడు మంచి ఎక్స్‌ పీరియన్స్‌ వస్తుంది. చాలా డిఫరెంట్‌ మూవీ ఇది.’ అని చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

➡️