చెఫ్‌గా నయనతారనయనతార తాజా ప్రాజెక్టు

Nov 29,2023 08:46 #movie, #nayanatara

‘అన్నపూరణి’. కొత్త దర్శకుడు నీలేష్‌ కృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్‌ చెఫ్‌ అవ్వాలనుకుంటుంది. ఈ క్రమంలోనే తనకు ఎదురైన సవాళ్లను, ఒత్తిడిని తట్టుకుని దేశంలో బెస్ట్‌ చెఫ్‌గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా కథ. జై, సత్యరాజ్‌, అచ్యుత్‌ కుమార్‌, కెఎస్‌ రవికుమార్‌, నరేష్‌ చక్రవర్తి తదితరులు కనిపించనున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్‌-1 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

➡️