డబ్బింగ్‌ అంటే నాకు భయం : మాళవిక

Dec 2,2023 08:42 #malavika, #movie

‘సినిమా మేకింగ్‌లో నాకు డబ్బింగ్‌ చెప్పడమే అన్నిటికంటే కష్టమైన పని. నేను ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పేటప్పడు ఎవరైనా వచ్చి నాచేయి పట్టుకుని ధైర్యాన్నిస్తారా’ అంటూ సరదాగా పోస్ట్‌ పెట్టారు హీరోయిన్‌ మాళవికా మోహనన్‌. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తారల్లో నటి మాళవిక మోహనన్‌ ఒకరు. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటించే మాళవిక తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను తరచూ షేర్‌ చేస్తుంటారు. ప్రస్తుతం ఆమె విక్రమ్‌ హీరోగా రూపొందుతోన్న ‘తంగలాన్‌’లో నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను షేర్‌ చేస్తూ మాళవిక చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

➡️