తెలుగు నేపాలీ చిత్రంలో బ్రహ్మానందం

Feb 1,2024 19:05 #Brahmanandam, #movie

బ్రహ్మానందం నటించిన తెలుగు నేపాలి మూవీ ‘హ్రశ్వ దీర్ఘ’ విడుదలకు సిద్ధమైంది. గురువారం బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల తేదీ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ ఫొటో విడుదల చేశారు. ఈ సినిమాకి చంద్ర పంత్‌ దర్శకత్వం వహించగా కబీర్‌ లాల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు. హరిహర్‌ అధికారి స్టోరీ అందించారు. నీతా దుంగనా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో హరిహర్‌ అధికారి, నీతా దుంగనా, బ్రహ్మానందం, ప్రదీప్‌ రావత్‌, సునీల్‌ వర్మ కబీర్‌ దుల్హన్‌ సింగ్‌ వంటి వారు కీలక పాత్రలలో నటించారు.

➡️