త్వరలో ‘మిస్‌ పర్ఫెక్ట్‌’ వెబ్‌ సిరీస్‌

Jan 3,2024 19:05 #movie

లావణ్య త్రిపాఠి, అభిజీత్‌ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలకపాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘మిస్‌ పర్ఫెక్ట్‌’. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ను బుధవారం చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ హాట్‌ స్టార్‌లో త్వరలో స్ట్రీమింగ్‌ కాబోతోందని సుప్రియ యార్లగడ్డ తెలిపారు. లావణ్య త్రిపాఠి ‘న్యూ ఇయర్‌ను పర్ఫెక్ట్‌గా మొదలుపెట్టబోతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

➡️