‘థగ్‌ లైఫ్‌’ మొదలైంది

Jan 24,2024 19:20 #Kamal Haasan, #movie

కమల్‌ హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ బుధవారం నుండి ప్రారంభమైంది. ‘డే 1 షూట్‌’ అంటూ చిత్రబృందం ఓ వీడియో విడుదలచేసింది. సినిమాలో నటిస్తున్న నటీనటులపై ఈ వీడియో చిత్రీకరించారు. ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. త్రిష, దుల్కర్‌ సల్మాన్‌, జోజు జార్జ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కమల్‌, రెడ్‌ జెయింట్‌ సినిమాస్‌, మద్రాస్‌ టాకీస్‌ ఈ చిత్ర నిర్మాణం వహిస్తున్నారు.

➡️