‘ది గోట్‌ లైఫ్‌’ బిగినింగ్‌ పోస్టర్‌

Jan 31,2024 19:09 #movie

మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్న సినిమా ‘ది గోట్‌ లైఫ్‌'(ఆడు జీవితం). హాలీవుడ్‌ యాక్టర్‌ జిమ్మీ జీన్‌ లూయిస్‌, అమలాపాల్‌, కేఆర్‌ గోకుల్‌, అరబ్‌ ఫేమస్‌ నటీనటులు తాలిబ్‌ అల్‌ బలూషి, రిక్‌ ఆబే ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ‘బిగినింగ్‌ లుక్‌ పోస్టర్‌’ని దుల్కర్‌ సల్మాన్‌ రిలీజ్‌ చేసారు. బెన్యామిన్‌ రాసిన గోట్‌ డేస్‌ నవల ఆధారంగా ఈ సినిమాను బ్లెస్సీ రూపొందించారు. ఏప్రిల్‌ 10న ఈ చిత్రం మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్‌ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం.

➡️