‘దూత’-2కి రంగం సిద్ధం

Mar 18,2024 20:15 #movies, #Naga Chaitanya, #web series

నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌కి రంగం సిద్ధమైంది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ మొదటి భాగం క్లైమాక్స్‌లోనే సీక్వెల్‌ గురించి ప్రకటించారు. అమెజాన్‌ ఫ్రైమ్‌ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ జర్నలిజం నేపథ్యంలో సాగుతుంది. సీజన్‌ 1లో చైతూ క్యారెక్టర్‌ని గ్రే షేడ్స్‌లో చూపించారు. ఆ పాత్ర సీజన్‌ 2లో పూర్తి పాజిటీవ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘దూత 2’కి సంబంధించిన షూటింగ్‌ దాదాపుగా పూర్తయినట్టు సమాచారం.

➡️