ధనుష్‌ ‘డి-50’ షూటింగ్‌ పూర్తి

Dec 16,2023 08:26 #Dhanush, #movie

తమిళ నటుడు ధనుష్‌, స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘డిా50’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. తాజాగా దీని షూటింగ్‌ పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించింది. హీరోగా ధనుష్‌కు ఇది 50వ సినిమా కాగా.. దర్శకుడిగా రెండోది. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాని ప్రారంభించారు. ‘ఈ సినిమాకు సహకరించిన నటీనటులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతోనే దీన్ని ఇంత తర్వగా పూర్తిచేయగలిగాం’ అంటూ నిర్మాతలకు ధనుష్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

➡️