పా రంజిత్‌ నిర్మాణంలో శివానీ

Mar 1,2024 19:05 #movie, #sivani rajasekhar

తమిళ దర్శకుడు పా రంజిత్‌ శిష్యుడు అకిరన్‌ మోసెస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని పా రంజిత్‌ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్‌గా శివానీ రాజశేఖర్‌ నటిస్తున్నారు. శ్రీనాథ్‌ బాజీ, లింగేష్‌, విశ్వంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించి కథ, తదితర వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

➡️