పుట్టినరోజుకు రావొద్దు : యశ్‌

Jan 6,2024 08:34 #movie, #yash

ఈనెల ఎనిమిదోతేదీన తన పుట్టినరోజుకు అందుబాటులో ఉండటం లేదనీ, ఎవ్వరూ తన ఇంటికి రావొద్దని కన్నడ హీరో యశ్‌ కోరారు. ‘మీరంతా నా పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్నారని తెలుసు. నన్ను వ్యక్తిగతంగా కలిసి విషెస్‌ చెప్పాలని అభిమానులంతా ఆశపడుతున్నారు. నన్ను నమ్మండి. పుట్టినరోజున నేను అందుబాటులో ఉండటం లేదు. మనమంతా మరో రోజు కలుద్దాం.ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేకపోయినా..మీ అందరికీ శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు.

➡️