పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ”ఫియర్‌”

Jan 17,2024 17:27 #New Movies Updates

హీరోయిన్‌ వేదిక లీడ్‌ రోల్‌ లో నటిస్తున్న ”ఫియర్‌” మూవీ ఇవాళ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్‌ అయ్యింది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్‌ ఏఆర్‌ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్‌ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్‌ కృష్ణ ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో నటులు మురళీ మోహన్‌ పాల్గొని స్క్రిప్ట్‌ అందించగా…డైరెక్టర్‌ కరుణాకరన్‌ క్లాప్‌ నిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ తేజ కాకుమాను, హీరో సోహైల్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

➡️