బాగా చేశావని నాన్న అన్నారు : రోషన్‌ కనకాల

Dec 30,2023 08:29 #movie, #roshan

‘నటన పరంగా అమ్మానాన్న (సుమ, రాజీవ్‌ కనకాల) సలహాలు తీసుకుంటాను. బబుల్‌గమ్‌ మూవీని వారు చూశారు. బాగా నచ్చింది. ఆ టైమ్‌లో నేను అక్కడ లేను. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నాన్న ఎమోషన్‌ అయి, ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే ‘బాగా చేశావ్‌’ అని అన్నారని హీరో రోషన్‌ కనకాల అన్నారు. రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రోషన్‌ కనకాల, మానసా చౌదరి జంటగా నటించిన చిత్రం బబుల్‌గమ్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్‌ ఈ సినిమాను నిర్మించింది. సినిమా విడుదలైన సందర్భంగా రోషన్‌ కనకాల మాట్లాడుతూ ‘నా బాల్యం అంతా దాదాపు తాతగారి (దేవదాస్‌ కనకాల) నటనా శిక్షణా కేంద్రంలో గడిచింది. నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం.న్యూ ఏజ్‌ కంటెంట్‌తో వచ్చిన బబుల్‌గమ్‌ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.

➡️