మంచి సమాజం కోసమే ‘పోలీసు వారి హెచ్చరిక”

Nov 29,2023 19:30 #babji, #movie

మన పిల్లలకు, కుటుంబానికి పంచే ప్రేమలో కొంతైనా మన చుట్టూ వుండే అనాథ బాలలకు పంచకపోతే మన పిల్లల భవిష్యత్తు గురించి చేసే ఆలోచనలో, పడే తపనలో, తీసుకునే జాగ్రత్తలో కొంతైనా అనాథలు, అభాగ్యుల విషయంలో ప్రదర్శించకపోతే వారు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చిక్కుకొని సమాజాన్ని నాశనం చేసే నేరస్థులుగా మారే ప్రమాదం వుంది’ అని దర్శకుడు బాబ్జీ తెలిపారు. తూలికా తనిష్క్‌ క్రియేషన్స్‌ పతాకంపై బెల్లి జనార్ధన్‌ నిర్మిస్తున్న ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయ్యిందని బాబ్జీ వెల్లడించారు. దసరా రోజున ప్రారంభించామనీ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తీసిన షూటింగ్‌తో దాదాపుగా చిత్రీకరణ పూర్తయ్యిందన్నారు. త్వరలోనే విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

➡️