మార్చిలో ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ షూటింగ్‌

Feb 13,2024 19:30 #jr ntr, #movie

జూనియర్‌ ఎన్టీఆర్‌ త్వరలో ‘వార్‌ 2’ సినిమాలో నటించటానికి రెడీ అవుతున్నారు. బుధవారం నుంచి దేవర తాజా షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. దర్శకుడు కొరటాల శివ, ఆయన బృందం ఏర్పాట్లు సిద్ధంచేసింది. గతనెలలో సైఫ్‌ ఆలీఖాన్‌కు ప్రమాదం జరగటంతో షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ వచ్చింది. సైఫ్‌ ఆలీఖాన్‌తో కాకుండా ఎన్టీఆర్‌, సెకండ్‌ హీరోయిన్‌తోపాటు ఇతర కీలక పాత్రధారులతో ఉన్న సన్నివేశాలు, పూర్తిచేయబోతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ పూర్తిచేసి బాలీవుడ్‌ సినిమా కోసం ఎన్టీఆర్‌ తహతహలాడుతున్నారు. ఎన్టీఆర్‌ పరిచయ చిత్రం ‘వార్‌ 2’ కావటంతో సోషల్‌మీడియాలో ఎక్కువగా సినిమా విషయాలపై వార్తలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. దేవరలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ కాగా, సెకండ్‌ హీరోయిన్‌గా శ్రుతి మరాటే కనిస్తారనే చర్చ జోరుగా వస్తోంది.

➡️