మార్చి 22న ‘ఆ ఒక్కటీ అడక్కు’ విడుదల

Feb 17,2024 19:30 #allari naresh, #movie

హీరోగా అల్లరి నరేష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఆయనకు ఇది 61వ సినిమా. డైరెక్టర్‌ మల్లి అంకం. చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భరత్‌ లక్ష్మీపతి సహనిర్మాత. గతంలో నరేష్‌ తండ్రి ఇవివి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించగా అప్పట్లో బ్లాక్‌బ్లస్టర్‌గా నిలిచింది. తాజాగా అదే పేరును టైటిల్‌గా పెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌గ్లింప్స్‌ విడుదల చేశారు. ఫరియా అబ్ధుల్లా కథానాయిక. వెన్నెల కిశోర్‌, జామీ లీవర్‌, వైవా, అరియానా గ్లోరీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అబ్బూరి రవి రైటర్‌గానూ, సూర్య డిపిఒగా పనిచేస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతాన్ని ఇస్తున్నారు. చోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌ కాగా, జెకె మూర్తి ఆర్ట్‌ డైరెక్టర్‌.

➡️