రానానాయుడు రికార్డు

Dec 13,2023 19:23 #movie, #Venkatesh

హీరోలు రానా, వెంకటేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ నెట్‌ ప్లిక్స్‌ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. 2023 జనవరి నుంచి జూన్‌ వరకు ఎక్కువ వ్యూస్‌ వచ్చిన వాటి వివరాలను నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా వెల్లడించింది. ఇందులో ‘రానా నాయుడు’ చోటు దక్కించుకుంది. 2021 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ప్రతి వారం ఎక్కువ వ్యూస్‌ సాధించిన టాప్‌ 10 మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ విడుదల చేస్తూ వస్తోంది. ఈసారి ఆరు నెలల జాబితాను విడుదల చేసింది. వ్యూస్‌ ఆధారంగా సుమారు 18 వేల టైటిల్స్‌ డేటాను పరిశీలించింది. గ్లోబల్‌గా ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టాప్‌ 400ను విడుదల చేసింది. ఇందులో ‘రానా నాయుడు’ టాప్‌ 336లో నిలిచింది. భారత్‌ నుంచి ఈ సిరీస్‌ మాత్రమే టాప్‌ 400లో స్థానం దక్కించుకుంది. దీన్ని 46 మిలియన్ల గంటలు చూసినట్లు ఆ సంస్థ తెలిపింది. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఈ సిరీస్‌ రూపొందింది.

➡️