రికార్డ్‌ బ్రేక్‌ సక్సెస్‌ ఖాయం

Mar 6,2024 08:11 #chadalawada srinivasarao, #movie

రికార్డ్‌ బ్రేక్‌ సినిమా నిజంగా సక్సెక్‌ కావటం ఖాయమని దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మించిన చిత్రమిది. ఈనెల 8న సినిమా విడుదల సందర్భంగా విశేషాలను మీడియాకు వెల్లడించారు. ”బిచ్చగాడు తర్వాత కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రజలు ఆదిరిస్తున్నారు. బడ్జెట్‌ పెద్దదా? చిన్నదా? అని కూడా చూటం లేదు. అందుకే ప్రజల మనసుకి హత్తుకునే విధంగా చాలా ఖర్చుపెట్టి ఈ సినిమాను నిర్మించాం. గ్రాఫిక్స్‌ అద్భుతంగా వచ్చాయి.” అని చెప్పారు. ఈ సినిమాలో నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్న కుమార్‌, శాంతి తివారీ, కాశీ విశ్వనాథ్‌ తారాగణంగా ఉన్నారు.

➡️