‘విక్రమార్కుడు-2’ టైటిల్‌ రిజిస్టర్‌

Mar 7,2024 19:05 #movie, #raviteja

రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ చిత్రానికి త్వరలో సీక్వెల్‌ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర నిర్మాత కేకే రాధా మోహన్‌ వెల్లడించారు. ‘భీమా’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గన్న ఆయన విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఈ సినిమాకి రవితేజ ఇంకా గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పారు. రవితేజ పార్ట్‌ 2పై అంతగా ఆసక్తిగా లేరని కానీ తనని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తారని తెలిపారు. సంపత్‌ డైరెక్ట్‌ చేస్తాడని స్పష్టం చేశారు. రవితేజ ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఈ చిత్రాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఇప్పటికే ‘విక్రమార్కుడు 2’ టైటిల్‌ రిజిస్టర్‌ కూడా చేయించానని తెలిపారు.

➡️