విజయ్ రాజకీయాల్లో రాణిస్తాడు

Feb 8,2024 19:30 #movie, #upasana

కోలీవుడ్‌ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన స్పందించారు. నిరంతరం దేశంలోనూ, రాష్ట్రంలోనూ జరిగే పరిణామాలపై సోషల్‌ మీడియాలో స్పందించే ఆమె తాజాగా విజయ్ పొలిటికల్‌ ఎంట్రీని స్వాగతించారు. ‘సినీ పరిశ్రమకు చెందిన చాలామంది రాజకీయాల్లో రాణించారు. ముఖ్యమంత్రులుగా కూడా సేవలు చేశారు. విజయ్ నటుడిగా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో వచ్చారంటే అది చాలా గొప్ప విషయం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే లీడర్‌ ఎవరైనా సపోర్టు చేయాలనేది నా అభిప్రాయం. ఒక వేళ సపోర్టు చేయకపోయినా వెనక్కి మాత్రం లాగకూడదు. విజయ్ గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.

➡️