విమర్శలపై దృష్టి పెట్టను : సందీప్‌ వంగా

విమర్శలను పట్టించుకోననీ, ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని దర్శకుడు సందీప్‌ వంగా వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’ సినిమాపై వస్తున్న ఆరోపణలపై ఆయన పై విధంగా స్పందించారు. ‘విమర్శల వల్ల సినిమాపై ప్రతికూలత ఏర్పడుతుంది. ఎక్కువసార్లు అబద్ధాన్ని చెబితే అదే నిజమనిపిస్తుంది. సినిమాల విషయంలోనూ అదే జరుగుతోంది. మా సినిమా కలెక్షన్లు రూ.350 కోట్ల దగ్గరే ఆగిపోతే ప్లాప్‌ అని ప్రకటించేవాళ్లు. నా దృష్టిలో రూ.100 కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా రూ.140 కోట్లు వసూలు చేస్తే అది హిట్‌ అయినట్లే. కానీ విమర్శకులు మాత్రం ప్రేక్షకాదరణ పొందలేదని ప్రచారం చేస్తుంటారు. సినిమా చూసి అన్నీ నేర్చుకోవటానికి అదేమి పాఠశాల కాదు కదా…నేడు తీసిన మూడు సినిమాలు హిట్‌ అయ్యాయి..అదే నాకు చాలు’ అంటూ వ్యాఖ్యానించారు.

➡️