విశాల్‌ ‘రత్నం’ పూర్తి చేశారు

Jan 24,2024 19:10 #movie, #vishal

విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’ షూటింగ్‌ పూర్తయినట్లు మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ యాక్షన్‌ ప్రియులందరికీ పండుగలా ఉంటుందని, త్వరలోనే ఫస్ట్‌ సింగిల్‌ని రిలీజ్‌ చేయనున్నట్లు విశాల్‌ తెలిపారు. ‘రత్నం షూటింగ్‌ మొత్తం పూర్తయింది. దర్శకుడు హరితో, డిఓపి సుకుమార్‌ అండ్‌ మొత్తం యూనిట్‌తో కలిసి మూడవసారి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. టుటికోరిన్‌, తిరుచ్చి, కారైకుడి, వెల్లూరు, తిరుపతి మరియు చెన్నై వంటి ప్రాంతాల్లో పూర్తి సానుకూల వాతావరణంలో పని చేయడం నాకొక మంచి జ్ఞాపకం. స్టోన్‌ బెంచర్స్‌ నిర్మాత కార్తీక్‌ అండ్‌ టీమ్‌కి కృతజ్ఞతలు. థాంక్యూ’ అని విశాల్‌ ట్వీట్‌ చేసారు.

➡️